Tirumala | శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Tirumala | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెల్లవారుజామున తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుమల :కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి (Union Minister) నితిన్ గడ్కరీ (Nitin Gadkary) గురువారం తెల్లవారుజామున తిరుమల(Tirumala) లో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి రాక సందర్భంగా టీటీడీ జెఈవో వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి గర్భగుడి వద్దకు తీసుకెళ్లారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం జేఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 69,029 మంది భక్తులు దర్శించుకోగా 28,547 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 2.90 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
Read more :
TTD Laddu Prasadam | తిరుమలలో లడ్డూ తయారీపై ఎటువంటి అపోహలొద్దు: టీటీడీ
AP airports | ఆంధ్రప్రదేశ్‌కు మూడు కొత్త ఎయిర్‌పోర్టులు : పురందేశ్వరి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

