టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. కొంతకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. గడిచిన మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చెయ్యలేక ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలాసార్లు మంచి ఆరంభాలు లభించినా, హాఫ్ సెంచరీలు చేసినా వాటిని శతకాలుగా మార్చలేకపోయాడు.
ఈ క్రమంలోనే అతనికి వెస్టిండీస్ పర్యటనలో విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో ఆసియా కప్ జరగనుంది. దీనిలో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. టీమిండియాకు ఎలాగైనా ఆసియాకప్ అందిచడమే తన లక్ష్యమని, అలాగే టీ20 వరల్డ్ కప్ కూడా భారత్ గెలిచేందుకు సహాయపడతానని కోహ్లీ అన్నాడు. దానికోసం జట్టుకు ఏం కావాలన్నా చెయ్యడానికి తాను సిద్దమని వెల్లడించాడు.
The 👑 giving us another reason to #BelieveInBlue!
Get your game face on & cheer for @imVkohli & #TeamIndia in their quest to win the #AsiaCup 2022 🏆!
Starts Aug 27 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/Ie3119rKyw
— Star Sports (@StarSportsIndia) July 23, 2022