Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఐపీఎల్ పదిహేడో సీజన్లో పరుగుల వరద పారిస్తున్నాడు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(Faf Duplesis) జతగా చితక్కొడుతూ జట్టుకు శుభారంభాలు ఇస్తున్నాడు. అంతేనా ఫీల్డింగ్‌లో చిరుతను తలపిస్తూ కుర్రాళ్లలో జోష్ నింపుతున్నాడు. ఈ సీజన్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అట్టడుగున ఉన్న ఆర్సీబీని ప్లే ఆఫ్స్ పోటీలోకి తెచ్చిన విరాట్ కోహ్లీ తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్రికెటర్‌గా ఎన్నో రికార్డులు తన పేరిట రాసుకున్న విరాట్.. వీడ్కోలు తర్వాత ఏం చేస్తారు? అనే ప్రశ్నకు ఏం చెప్పాడో తెలుసా..? ‘క్రీడారంగంలో ఉన్నందున మేము ఏదో రోజు కెరీర్ ముగించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి? అనేదానిపై నేను వర్కవుట్ చేస్తున్నా. అయ్యో.. నేనది చేయలేకపోయానే అనే బాధతో మాత్రం ఆటకు వీడ్కోలు పలకను. ఒక్కసారి ఆటకు గుడ్ బై చెప్పాక మీడియా అటెన్షన్‌కు దూరంగా ఉంటా. చెప్పాలంటే మీకు కొన్నాళ్లు కనిపించను’ అని కోహ్లీ నవ్వుతూ అన్నాడు. బెంగళూరు ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
“I wanna give it everything I have till the time I play, and that’s the only thing that keeps me going” 🤌
Virat’s emotional but promising words while talking at the @qatarairways Royal Gala Dinner. 🗣️#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/htDczGQpNf
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 15, 2024
పదిహేడో సీజన్లోనూ విరాట్ తన బ్యాట్ పవర్ చూపిస్తున్నాడు. ఈసారి తొలి శతకం నమోదు చేసిన కోహ్లీ.. నిలకడగా రాణిస్తూ ఆర్సీబీ వరుసగా ఐదు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు రజత్ పాటిదార్ (Rajat Patidar) సునామీలా చెలరేగుతుండడంతో బెంగళూరు అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఈ సీజన్లో విరాట్ 33 సిక్సర్లు బాదడమే కాకుండా 661 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్(Orange Cap) అట్టిపెట్టకున్నాడు. అంతేకాదు అత్యధికంగా 89 బౌండరీలు కొట్టిన భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. చివరిదైన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను మే 18న ఆర్సీబీ ఢీ కొట్టనుంది.
