భోపాల్: మధ్యప్రవేశ్ సీఎం మోహన్ యాదవ్ (Mohan Yadav) ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సీఎం మాట్లాడే తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బుధవారం హర్యానాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మాట్లాడారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ రాముడిని అగౌరవపరుస్తుందని, రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి మద్దతు ఇవ్వలేదని అన్నారు. అయితే అది పూర్తయిన తర్వాత, వారు ‘రామనామ్’ అని జపించడం ప్రారంభించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ను విమర్శించే క్రమంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు.
కాగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. సీఎం మోహన్ యాదవ్ అసభ్య పదజాలంపై మండిపడ్డారు. ‘డియర్ మోహన్ యాదవ్ జీ! మీ పౌరాణిక అధ్యయనాలు, విద్యాపరమైన అవగాహనను ప్రశ్నించడానికి మీ అభ్యంతరకర భాష, వ్యాఖ్యలు సరిపోతాయి. ముఖ్యమంత్రిగా మీ ఇమేజీ, విజ్జానాన్ని ఇంతగా దిగజార్చేలా మీ ప్రసంగాలు రాస్తున్నది ఎవరో తెలియడం లేదు’ అని అందులో పేర్కొన్నారు. మరోవైపు సీఎం మోహన్ యాదవ్ కాంగ్రెస్‌ను అసభ్య పదజాలంతో దూషించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यदि @BJP4India की सुनने और समझने की शक्ति काम कर रही हो, तो पुनः दोहरा रहा हूं! मेरे आराध्य प्रभु #श्रीराम स्तुति, आस्था और आराधना की गौरवशाली अनुभूति हैं!
लेकिन, संकीर्ण सोच-समझ वाली सत्तालोलुप #भाजपा ने जगत के स्वामी को ही सियासत का विषय बना दिया! यही कांग्रेस की असहमति का… pic.twitter.com/eqpOjowrgR
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) May 15, 2024