Virat Kohli: మరో నాలుగు రోజుల్లో మొదలుకాబోయే తొలి టెస్టుకు ముందే భారత్కు వరుస షాకులు తాకుతున్నాయి. ఇదివరకే టెస్టు సిరీస్ నుంచి మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్లు పలు కారణాలతో తప్పుకోగా తాజాగా ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా స్వదేశానికి తిరిగిచ్చాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా కోహ్లీ ఇండియాకు వచ్చాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కొద్దిరోజుల క్రితమే వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ.. ఇటీవలే సౌతాఫ్రికాకు వెళ్లాడు. కానీ కుటుంబ కారణాల రీత్యా అతడు ముంబై వచ్చాడని తెలుస్తోంది. అయితే కోహ్లీ సెంచూరియన్ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టెస్టుకు ముందే మళ్లీ దక్షిణాఫ్రికాకు చేరుకుంటాడని, ఫస్ట్ టెస్టు ఆడతాడని చెప్పడం భారత అభిమానులకు ఊరటనిచ్చేదే. కానీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని కోహ్లీ భారత్కు వచ్చినా కచ్చితంగా ఆ సమస్య ఏంటన్నది మాత్రం సమాచారం లేదు. భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) జరగాల్సి ఉంది.
Virat Kohli returns home due to a family emergency. He’ll be back in time for the Boxing Day Test.
Ruturaj Gaikwad ruled out of the Test series. (Cricbuzz). pic.twitter.com/Cl9PRUfcV7
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 22, 2023
మరోవైపు వన్డే సిరీస్లో భాగంగా రెండో వన్డేలో చేతివేలికి గాయమైన రుతురాజ్ గైక్వాడ్.. టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రుతురాజ్ విషయంలో బీసీసీఐ స్పందిస్తూ.. ‘రెండో వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతడి చేతివేలికి తగిలిన గాయం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. అతడు బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు..’ అని తెలిపింది. టెస్టు సిరీస్ లోపు అతడు గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోవడం కష్టమేనని, గైక్వాడ్ శనివారం భారత్కు తిరిగివస్తాడని తెలుస్తోంది.