Virat Kohli : సుదీర్ఘ ఫార్మాట్‌కు సన్నద్ధమవుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రాక్టీస్ వేగం పెంచాడు. బంగ్లాదేశ్‌తో చెపాక్ స్డేడియం (Chepauk Stadium)లో జరుగబోయే తొలి టెస్టులో చెలరేగాలనే కసితో ఉన్న కోహ్లీ నెట్స్ ప్రాక్టీస్‌లో పవర్ ఫుల్ షాట్లు ఆడాడు. ఈ క్రమంలో విరాట్ కొట్టిన బంతి వేగానికి స్డేడియం గోడ బద్ధలైంది. డ్రెస్సింగ్ రూమ్ సమీపంలోని గోడకు ఏకంగా పెద్ద రంధ్రం పడింది. దాంతో, అందరూ ఒకింత షాకయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లపై రన్ మెషీన్ ఇదే తరహాలో చెలరేగి ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా(South Africa)పై అర్ధ శతకంతో మెరిసిన కోహ్లీ శ్రీలంక పర్యటనలో విఫలమయ్యాడు. వరుస డకౌట్లతో నిరాశపరిచాడు. దాంతో, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఫామ్ అందుకోవాలని అతడు కసితో ఉన్నాడు. మరోవైపు ఫ్యాబ్ 4లో ఒకడైన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) టెస్టుల్లో వరుస శతకాలతో దూసుకెళ్తున్నాడు.
విరాట్ కోహ్లీ, జో రూట్
ఈమధ్యే 34వ సెంచరీ బాదేసిన రూట్ టాప్‌లో ఉన్నాడు. కోహ్లీ ఏమో 29వ శతకం దగ్గరే ఆగిపోయింది. అందుకని బంగ్లాదేశ్‌పై దంచి కొట్టి 30వ వంద నమోదు చేయాలని కోహ్లీ భావిస్తున్నాడు. సెప్టెంబర్ 19న చెపాక్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తొలి టెస్టు ఆడనుంది. నవంబర్‌లో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య 22వ తేదీన తొలి టెస్టు జరుగనుంది.