Soudi Footballer : సౌదీ అరేబియా ఫుట్‌బాలర్ ఫహద్ అల్ మువల్లాద్(Fahad Al Muwallad) అనూహ్యంగా దవాఖాన పాలయ్యాడు. దుబాయ్‌లోని రెండస్థుల భవనం బాల్కనీపై నుంచి ఫహద్ కిందపడి ఐసీయూ(ICU)లో చేరాడు. కొన్ని రోజుల విహారం కోసం దుబాయ్‌కు వచ్చిన అతడు ఓ అపార్ట్మెంట్లో బస చేశాడు. అయితే.. గురువారం అతడు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే ఇరుగుపొరుగువాళ్లు హాస్పిటల్‌కు తరలించారు.
గాయాల తీవ్రత దృష్ట్యా ఫహద్‌కు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారురు. ప్రస్తుతం అతడ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఫహద్ తనంతట తానే కాలు జారి కింద పడ్డాడా? మరెవరైనా అతడిని తోసేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Dubai Police Statement: The health condition of player Fahad Al Muwallad is under observation as he lies in intensive care in one of Dubai’s hospitals, where the efforts of the medical teams continue to provide him with the necessary care.
As part of its commitment to… pic.twitter.com/JsK5vunceI
— أخــر الأخـبــار (@latestnews2026) September 14, 2024
ఫహద్ సౌదీ అరేబియాకు చెందిన అల్ షాబాద్ (Al Shabad)క్లబ్‌కు ఆడుతుంటాడు. ఆ క్లబ్ తరఫున అద్భుతంగా రాణించడంతో రెండేండ్ల క్రితం ఖతార్ ఆతిథ్యమిచ్చిన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup 2022)లో ఫహద్ సౌదీ అరేబియా స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. అయితే.. డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. నిషేధిత డ్రగ్ తీసుకున్నాడనే కారణంతో అతడిపై వేటు పడింది.