IPSs Suspension | ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్
IPSs Suspension | ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. ముంబై నటి కాదంబరి జెత్వాని పై అక్రమంగా పెట్టిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.
అమరావతి : ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. ముంబై నటి కాదంబరి జెత్వాని (Kadambari Jatwani) పై అక్రమంగా పెట్టిన కేసులో ముగ్గురు ఐపీఎస్(IPS) అధికారులు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) , విజయవాడ మాజీ సీపీ కాంతారాణా తాతా(Kanthirana Tata) , విశాల్ గున్ని ( Vishal gunni) ని సస్పెండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు. వైసీపీ హయాంలో ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తతో కాదంబరి జత్వానికి మధ్య జరిగిన వివాదం పంచాయతీ ఏపీలోని వైసీపీ కీలక నేత వద్దకు వచ్చింది. దీంతో ఆ కీలకనేత పారిశ్రామికవేత్తతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అతడిని కాపాడేందుకు పోలీసుల బాస్‌లను ఉపయోగించాడు. దీంతో పోలీసు అధికారులు జత్వానిపై అక్రమంగ కేసులు పెట్టి తల్లిదండ్రులతో పాటు ఆమెను జైలులో ఉంచారు.
అనంతరం ఆమెను బెదిరించి సంతకాలు తీసుకుని కేసును సెటిల్మెంట్ చేశారు. అనంతరం ఏపీలో ఎన్నికలు జరుగడం వైసీపీ అధికారం కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నటి జత్వాని కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో ముఖ్యమంత్రి స్పందించి విచారణ ఆదేశించడంతో పాటు విచారణ కమిటీని నియమించి వారి నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఐపీఎస్‌లను సస్పెన్షన్ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 21-10-2023 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

