అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha steel plant) పై కూటమి ప్రభుత్వం తన విధానాన్ని వెల్లడించాలని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు ప్రజలకు సంబంధించిందని ప్లాంట్‌ను ఉంచుతారా? ఊడగొడుతారో స్పష్టం చేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించాలని తెలిపారు. వైసీపీ (YCP) హయాంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పడం వల్ల ప్రైవేటీకరణ జరుగలేదని వెల్లడించారు. ఎన్టీఏలో బాగస్వామిగా ఉన్న చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సూచించారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వకుండా వైసీపీ పోరాటాలు చేస్తుందని అన్నారు. రాజీనామాలతో ఉపయోగం లేదని పేర్కొన్నారు.