Garlic | ఇటీవల కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గడిచిన 24రోజుల్లో ధరలు రెండింతలు పెరిగాయి. వెల్లుల్లి కిలో రూ.500కి ఎగిసింది. మరో వైపు మిర్చి కిలో రూ.120కి చేరింది. కొత్తిమీర, క్యాబేజీ, ఉల్లి, బెండకాయలు, అల్లం, బంగాళాదుంప, టమాట, దోసకాయ కూరగాయలు ధరలు భారీగానే పెరిగాయి. ధరల పెరుగుదలతో సామాన్యుడి జేబుపై భారీగానే ప్రభావం పడుతున్నది. ఇటీవల దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో భారీ దంచికొట్టాయి. వరదలకు పంట చేలన్నీ నీటమునిగాయి. దీంతో కూరగాయలన్నీ పాడైపోతున్నాయి. దీంతో మార్కెట్లకు కూరగాయలు రావడం భారీగా తగ్గింది. దిగుబడి తక్కువగా ఉండడం.. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు భారీగా ఉన్నాయని గ్రేటర్ నోయిడాలోని సెక్టార్కు చెందిన వ్యాపారి సంజయ్ ఖాన్ తెలిపారు. కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు తక్కువగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
క్యాలీఫ్లవర్ రూ.200, పచ్చిమిర్చి రూ.120, బంగాళదుంప రూ.40, టమాటా రూ.50, దోసకాయ రూ.50, పొట్లకాయ రూ.40 చొప్పున విక్రయిస్తున్నట్లు వ్యాపారి పేర్కొన్నారు. అదే సమయంలో ఉల్లి రూ.60, బెండకాయ రూ.80, అల్లం రూ.160, బెండకాయ కిలో రూ.50 నుంచి 60 వరకు విక్రయిస్తున్నట్లు తుగ్లక్పూర్ కూరగాయల మార్కెట్ విక్రయదారు రమేశ్ పేర్కొన్నారు. ఘజియాబాద్ నుంచి తుగ్లక్పూర్ మార్కెట్కు కూరగయాలు తీసుకువస్తుంటారు. ప్రస్తుతం రవాణా తగ్గడంతో ధరలపై ప్రభావం చూపుతున్నది. ఎంత దూరం నుంచి కూరగాయలు వస్తాయో.. రవాణా ఖర్చు కూడా అంత ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మూడు రోజుల కిందట కిలో వెల్లుల్లి ధర రూ.400 ఉండగా, ఆదివారం కిలో వెల్లుల్లి ధర రూ.500కి చేరింది. ఒకేరోజు రూ.100 పెరిగింది. క్యాలీఫ్లవర్ మూడు రోజుల కిందట కిలో రూ.150 పలికింది. ఆదివారం కిలో రూ.200కి చేరింది. అలాగే మిగతా కూరగాయల మూడురోజుల్లోనే భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.