Virat Kohli | ఆ రేసింగ్ సిరీస్ కోసమే టెస్టులకు దూరం.. కోహ్లీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
Virat Kohli : ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమవ్వడంపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తొలిసారి స్పందించాడు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలిగినట్టు బీసీసీఐకి చెప్పినా సరే మీడియాలో మాత్రం రకరకాల వార్తలు...
Virat Kohli : ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమవ్వడంపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తొలిసారి స్పందించాడు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలిగినట్టు బీసీసీఐకి చెప్పినా సరే మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో, ఈ స్టార్ క్రికెటర్ 10 రోజుల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.
అందులో కోహ్లీ ఈ1 సిరీస్‌లో పాల్గొనున్నతన ‘టీమ్ బ్లూ రైజింగ్’జట్టుప్రమోషన్ పోస్ట్ పెట్టాడు. టీమ్ బ్లూ రైజింగ్ కో ఓనర్‌గా ఈ 1 సిరీస్‌లో కొత్త సవాల్‌కు సిద్ధమవుతున్నా. నా విన్నింగ్ మైండ్‌సెట్‌తో మీరు నీళ్లపై చరిత్ర సృష్టించండి అంటూ విరాట్ ఆ పోస్ట్‌లో తన జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
క్రికెటర్‌గా కోట్లు ఆర్జిస్తున్న కోహ్లీ రెస్టారెంట్ బిజినెస్‌లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. అతడికి వన్ 8 కమ్యూనే పేరుతో ముంబై, కోల్‌కతా, పుణేలోబ్రాంచ్లు ఉన్నాయి. క్రికెట్‌తో పాటు ఈ రేసింగ్‌లను ఎంతో ఇష్టపడే విరాట్… ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ రేస్బోట్ సిరీస్(Electric Raceboat Series)లో జట్టుకు సహ యజమానిగా ఉన్నాడు.

అది కే మిశ్రాతో కలిసి అతడు యూఐఎమ్ ఈ1 వరల్డ్ చాంపియన్‌షిప్(E 1 World Championship)లో టీమ్ బ్లూ రైజింగ్ జట్టును కొనుగోలు చేశాడు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఫిబ్రవరి 2,3 తేదీల్లో ఈ రేస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ రాజ్‌కోట్‌లో ఫిబ్రవరి 15న జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు.

వన్డే వరల్డ్ కప్‌లో రికార్డు సెంచరీతో సచిన్ టెండూల్కర్ రికార్డు బద్ధలు కొట్టిన కోహ్లీ.. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనలోనూ దుమ్మురేపాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన కోహ్లీ అనూహ్యంగా తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగాడు. టాపార్డర్‌లో, మిడిలార్డర్లో గోడలా నిలబడే కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా(), అజింక్యా రహానే()లు లేకుండానే రోహిత్ సేన ఉప్పల్ టెస్టులో బరిలోకి దిగింది.

తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్(81), రాహుల్(84), జడేజా(86) అర్ధ సెంచరీలతో ఆదుకున్నా… రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారత ఆటగాళ్ఉల మొత్తానికే చేతులెత్తేశారు. ఓలీ పోప్(196) సూపర్ సెంచరీ అనంతరం ఇంగ్లండ్ అరంగేట్రం స్పిన్నర్ టామ్ హర్ట్లే ధాటికి వచ్చినవాళ్లు వచ్చినట్టు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో, గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటిమి పాలైంది. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 2న రెండో టెస్టు వైజాగ్‌లో జరగునుంది.
ఇవి కూడా చదవండి
- Mitchell Marsh | ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్‌లో మార్ష్ డబుల్ ధమాకా.. టీ20 క్రికెటర్ ఎవరంటే..?
- Union Budget | వేతన జీవులకు ఊరట కలిగేనా.. జీతాలు పెరిగినా ఇన్‌కం ట్యాక్స్ లిమిట్ పెంచక ఇబ్బందులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

