Virat Kohli-Lionel Messi | ఫుట్ బాల్ లెజెండ్ లియానిల్ మెస్సీపై భారత్ క్రికెట్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైచేయి సాధించాడు. అవును ఇది నిజం. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో ‘ఫ్యూబిటీ’ ఒకటి. ఈ పేజీకి 3.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ అవార్డు కోసం కోహ్లీ, లియానిల్ మెస్సీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇందులో లియానిల్ మెస్సీని విరాట్ కోహ్లీ 78-22 శాతం ఓట్లతో ఓడించి ‘ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డును సొంతం చేసుకున్నాడు. సాకర్ యోధుడు మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నా.. కోహ్లీకి గల క్రేజ్ ముందు నిలవలేకపోయాడు.
కోహ్లీ, మెస్సీలతోపాటు జకోవిచ్, పాట్ కమిన్స్, లేబ్రాన్ జేమ్స్, ఎర్లింగ్ హాలండ్, క్రిస్టియానో రొనాల్డో తదితరులు పోటీ పడ్డారు. 2023లో వివిధ ఆటల్లో అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించిన ఆటగాళ్ల మధ్య ఈ పోటీ సాగింది. ఫైనల్లో కోహ్లీ, మెస్సీ పోటీ పడ్డారు. ఈ ఏడాదంతా కోహ్లీ.. క్రికెట్ లో పరుగుల వరదతో పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. లియానిల్ మెస్సీ కూడా సాకర్ టోర్నమెంట్లలో గోల్స్ సాధించి తన జట్టుకు విజయాలు అందించాడు.
It's Kohli vs Messi in the final voting for the "Athlete of the year" award in one of the biggest sports pages on Instagram – Pubity Sport. pic.twitter.com/gcyLSPbywA
— Johns. (@CricCrazyJohns) December 30, 2023