దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకున్నాడు.
గతవారం పాకిస్థాన్‌తో శతకం, సోమవారం సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేసిన కోహ్లీ.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఒక ర్యాంక్ పైకి ఎగబాకి నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. రోహిత్ రెండు ర్యాంక్‌లు దిగజారి ఐదో స్థానంలో ఉన్నాడు. గిల్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.