Virat Kohli | ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నాగ్‌పూర్‌కు మ్యాచ్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడడం లేదని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించాడు. గాయం నేపథ్యంలో వన్డేకు విశ్రాంతి ఇవ్వగా.. ప్రస్తుతం కోహ్లీకి తీవ్ర సమస్య లేదని తెలుస్తున్నది. త్వరలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న విషయం తెలిసిందే. ఐసీసీ ఈవెంట్‌కి మరో పది రోజులు సమయం ఉన్నది. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సైతం వెన్ను సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదు. ఇక విరాట్ మోకాలి సమస్యలతో బాధపడుతున్నాడన్న వార్త అభిమానులను కలవరానికి గురి చేస్తున్నది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో ప్రారంభం కానుంది. టీమిండియా మ్యాచులన్నీ దుబాయి వేదికగా నిర్వహించనుండగా.. ఈ నెల 20న తొలి మ్యాచ్ ఆడనున్నది. విరాట్ కోహ్లీ గాయం అంత తీవ్రమైందేమీ కాదని.. ఇంగ్లాండ్‌తో జరిగే మిగతా రెండు వన్డేలకు అందుబాటులో ఉంటాడని టీమ్ మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. ఇంగ్లాండ్‌తో రెండో వన్డే కటక్‌లో, చివరిదైన మూడో వన్డే 12న అహ్మదాబాద్‌లో జరుగనున్నది.
విరాట్ కోహ్లీ 2017 నుంచి గాయం కారణంగా మ్యాచ్ ఆడలేకపోవడం ఇది ఆరోసారి. బుధవారం నెట్ సెషన్లో ఈ అసౌకర్యంగా ఉండడంతో ఎక్కువగా బ్యాటింగ్ సాధన చేయలేకపోయాడు. మ్యాచ్‌కు ముందు రోజు షటిల్ స్ప్రింట్‌కు వచ్చిన సమయంలో మోకాలికి కట్టుకట్టి కనిపించింది. విరాట్‌ని ఫిజియోథెరపిస్ట్ కమలేష్ జైన్ పరిశీలిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు స్కాన్ కోసం తీసుకోలేదని సమాచారం. అయితే, కోహ్లీ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చెకప్ కోసం బెంగళూరుకు వెళ్తాడా? లేదా? తెలియాల్సి ఉంది. రెండో మ్యాచ్ కోసం కటక్‌కు వెళ్తాడా? అన్నది చూడాల్సిందే. విరాట్ వన్డేల్లో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. 14వేల పరుగుల క్లబ్లో చేరేందుకు ఇంకా 94 పరుగులు చేయాల్సి ఉంది.