ఎవరూ ఊహించనంత థ్రిల్లింగ్గా సాగిన ఇండియా-పాకిస్తాన మ్యాచ్లో చివరకు భారత్ గెలిచింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మొక్కవోని ధైర్యంతో క్రీజులో నిలబడిన విరాట్ కోహ్లీ.. చివరకు 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే విజయం తర్వాత పిడికిలితో నేలను బలంగా గుద్దిన కోహ్లీ ఎమోషనల్ అయిపోయాడు.
జట్టు సభ్యులు వచ్చి తనను చుట్టుముట్టినప్పుడు అతని కళ్లు చెమర్చాయి. ఆకాశం వైపు చూస్తూ ఆ నీటిని కళ్లలోనే అదుముకునే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ విజయానందంలో కెప్టెన్ రోహిత్ శర్మ అయితే వచ్చీ రావడంతోనే కోహ్లీని భుజాలపై ఎత్తుకొని తిప్పేశాడు.
అంతకుముందు జాతీయ గీతాలాపన సమయంలో రోహిత్ కూడా ఎమోషనల్ అయ్యాడు. జాతీయ గీతం ముగిసిన వెంటనే కళ్లలో తిరిగిన నీళ్లను అదుముకునేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది.
Winning Moment of the Match !!
AN Emotional @imVkohli after Winning #INDvPAK #T20WC2022 Match !!
Amazing Scenes. Kohli is a Legend.. pic.twitter.com/BmelqsTdBg
— Shilpa Bodkhe – प्रा.शिल्पा बोडखे (@BodkheShilpa) October 23, 2022
Look at these eyes. Every Indian can relate with Rohit sharma right now. SIap on those who say they play only for money.pic.twitter.com/HAH8myXBsv
— Jahazi (@Oye_Jahazi) October 23, 2022