Virat Kohli | బెంగళూరు: ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న రన్ మిషీన్ విరాట్ కోహ్లీ మరో మూడేండ్ల పాటు ఆ జట్టుతోనే కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే ‘ఆర్సీబీ బోల్డ్ డైరీస్’లో వెల్లడించాడు.
‘ఈ సైకిల్ (2024-27) ముగిసేసరికి ఆర్సీబీలో నేను 20 ఏండ్ల కెరీర్ను పూర్తిచేసుకుంటా. అది నాకు చాలా ప్రత్యేకం. ఇన్నేండ్ల పాటు ఒకే జట్టుకు ఆడతానని నేను కలలో కూడా ఊహించలేదు. అని కోహ్లీ తెలిపాడు.