Team India Vs Australia | గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా నిలకడగా ఆడుతున్నది. 353 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా 25 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. క్రీజ్‌లో 48 పరుగులతో విరాట్ కోహ్లీ, 10 పరుగులతో శ్రేయస్ అయ్యర్ కొనసాగుతున్నారు. 26వ ఓవర్లో కేమరూన్ గ్రీన్ వేసిన నాలుగో బంతిని బాది రెండు పరుగులతో విరాట్ కోహ్లీ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 26 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
అంతకుముందు 21వ ఓవర్లో టీం ఇండియా సారధి రోహిత్ శర్మ పెవిలియన్ దారి పట్టాడు. 21 ఓవర్లో మ్యాక్స్ వెల్ వేసిన చివరి బంతిని రోహిత్ శర్మ స్ట్రయిట్‌గా బాదాడు. మ్యాక్స్ వెల్ సైతం మెరుపు వేగంతో ఒంటిచేత్తో వడిసిపట్టి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అంతకుముందు నాలుగో బంతిని సిక్సర్ బాదాడు రోహిత్. రోహిత్ ఔటయ్యే సమయానికి 81 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. 21 ఓవర్ ముగిసే సరికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.