బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 29, 2020 , 17:08:15

నెం.1 కెప్టెన్: ధోనీ రికార్డు బ్రేక్‌ చేసిన కోహ్లీ

నెం.1 కెప్టెన్: ధోనీ రికార్డు బ్రేక్‌ చేసిన కోహ్లీ

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో కోహ్లీ 25 పరుగులు చేయ‌డం ద్వారా భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

హామిల్టన్‌:  టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు.   ఆట‌గాడిగా ఎన్నో ఘ‌న‌త‌లు సాధించిన విరాట్ తాజాగా కెప్టెన్‌గా మ‌రో మైలురాయి అందుకున్నాడు.   న్యూజిలాండ్‌తో మూడో టీ20లో కోహ్లీ   25 పరుగులు చేయ‌డం ద్వారా భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. హామిల్ట‌న్‌ టీ20లో కోహ్లీ 38 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే.    భారత్‌ తరఫున కెప్టెన్‌గా అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ ధోనీ( 1112 ) పేరిట ఉంది.  తాజాగా ఆ రికార్డును  కోహ్లీ(1126) త‌న పేరిట లిఖించుకున్నాడు. 

ఓవరాల్‌గా టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక రన్స్‌ చేసిన జాబితాలో  సౌతాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌(1,273), న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలయమ్సన్‌(1148,  భార‌త్‌తో మూడో టీ20 ముందు వ‌ర‌కు) ఉన్నారు. దీంతో  ఓవ‌రాల్ జాబితాలో కింగ్ కోహ్లీ మూడో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.  పొట్టి క్రికెట్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్‌-10 కెప్టెన్ల జాబితాలో విరాట్ ఒక్క‌డే సుమారు 45కు పైగా అత్యుత్త‌మ స‌గ‌టుతో కొన‌సాగుతుండ‌టం విశేషం. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 107 మ్యాచ్‌ల్లో 2713 ప‌రుగులు చేశాడు. logo