Virat Kohli : భారత మాజీ కెప్టె్న్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి మైదానంలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అర్ధ శతకంతో మెరిసిన విరాట్ ఈసారి స్వదేశంలో చెలరేగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. దక్షిణాఫ్రికా(South Africa)తో మూడు వన్డేల సిరీస్ స్క్వాడ్‌లో ఒకడైన కోహ్లీ ముంబై చేరుకున్నాడు. ఆసీస్ పర్యటన తర్వాత లండన్‌లోనే ఉండిపోయిన అతడు మంగళవారం సొంతగడ్డకు తిరిగొచ్చాడు. నలుపు రంగు ప్యాంట్.. చాక్లెట్ కలర్ షర్ట్.. తలకు టోపీ.. కళ్లద్దాలు పెట్టుకొని సింపుల్ లుక్‌లో కనిపించిన రన్ మెషీన్ ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగాడు.
నిరుడు టీ20లకు.. ఈ ఏడాది జూన్‌లో టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్న విరాట్ ఆస్ట్రేలియా పర్యటనలో రెండు మ్యాచుల్లో సున్నాకే ఔటైనా.. సిడ్నీ వన్డేలో అర్ధ శతకంతో రాణించాడు. ఇప్పుడు స్వదేశంలో దక్షిణాఫ్రికాపై బ్యా్ట్ ఝులిపించేందుకు ముంబై చేరుకున్నాడు కోహ్లీ. ప్రస్తుతం 50 ఓవర్ల ఆటలో 51 శతకాలు.. 75 హాఫ్ సెంచరీలు బాదిన అతడు.. సఫారీలపై చెలరేగితే మరిన్ని రికార్డులు బద్ధలవ్వడం ఖాయం. నవంబర్ 30న రాంచీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనున్నందున.. కోహ్లీ త్వరలోనే స్క్వాడ్‌తో కలువనున్నాడు.
King Kohli has arrived in his kingdom. pic.twitter.com/hfB4MmpWKA
— Virat Kohli Fan Club (@Trend_VKohli) November 25, 2025
ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు డకౌట్స్ తర్వాత.. అభిమానులను అలరించే ఇన్నింగ్స్ ఆడాడు విరాట్. సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచిన కోహ్లీ.. రోహిత్ శర్మతో కలిసి.. అజేయంగా జట్టును గెలిపించాడు. కూపర్ క్రాన్లీ ఓవర్లో సింగిల్ తీసి వన్డేల్లో 75వ అర్ధ శతకం సాధించాడు విరాట్. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. కుమార సంగక్కర (Kumar Sangakkara) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బద్ధలు కొట్టాడీ స్టార్ క్రికెటర్.
🚨Virat Kohli in Australia🚨
⚡️Most International 100s by a visiting batter (12)
⚡️3rd most runs by a visiting batter across formats
⚡️Scored his maiden Test century
⚡️Twin 100s on captaincy debut
⚡️Only Indian captain to win a bilateral ODI series
⚡️Top-scorer in 2022 T20 WC pic.twitter.com/GONC2stbMc— Cricbuzz (@cricbuzz) October 26, 2025
ప్రస్తుతం విరాట్ ఖాతాలో 14,235 రన్స్ ఉండగా.. టాప్ స్కోరర్‌గా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ 18,426 పరుగులతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే.. వన్డేలు, టీ20లు కలిపితే.. సచిన్ కంటే కోహ్లీ(18,437)నే ఒక పరుగు ముందున్నాడు. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 13,704 పరుగులతో మూడో నాలుగో స్థానంలో నిలిచాడు.