Viral | గుడికి లక్ష రూపాయల విరాళం ఇచ్చిన బిచ్చగత్తె.. ఎక్కడంటే?
గుళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే బిచ్చగాళ్లకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు భక్తులు. అలా సంపాదించిన ఒక్కో రూపాయి ఖర్చు పెట్టకుండా దాచి పెట్టిందా వృద్ధురాలు. చివరకు అలా దాచిన డబ్బును దగ్గరలోని గుడికి విరాళంగా ఇచ్చింది. ఈ వింత సంఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో వెలుగు చూసింది. స్థానికంగా ఆలయాల వద్ద భిక్షాటన చేసే అశ్వత్థామ అనే మహిళ.. గత 18 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతోంది.
18 ఏళ్ల క్రితం భర్త మరణించడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆమె ఈ వృత్తిలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి తను సంపాదించిన డబ్బులో చాలా తక్కువ ఖర్చు పెట్టుకుంటూ జీవనం సాగిస్తోంది. మిగతా డబ్బును ఒక బ్యాంకులో దాచి పెట్టి, కొంత మొత్తం అవగానే ఆలయాలకు విరాళంగా ఇవ్వడం మొదలు పెట్టింది. ఇలా తాజాగా బంట్వాల్ తాలూకాలోని శ్రీ క్షేత్ర రాజరాజేశ్వరి ఆలయంలో అన్నదానం నిర్వహించడానికి రూ.లక్ష విరాళం అందజేసింది.
అంతేకాదు అంతకుముందు సాలిగ్రాంలోని శ్రీ గురునారసింహ ఆలయానికి లక్ష రూపాయలు, అలాగే పలాలిలోని శ్రీ అఖిలేశ్వర ఆలయంలో ఉండే అయ్యప్ప భక్తుల కోసం రూ.1.5 లక్షలు విరాళం అందజేసింది. ఇవే కాకుండా లక్షలాది మందికి అన్నదానం చేసింది. ఉడుపి, దక్షిణ కర్ణాటకలోని పలు అనాథాశ్రమాలకు కూడా విరాళాలు ఇచ్చింది.
ఆమె ఇలా చేయడం నిజంగా చాలా గొప్ప విషయమని రాజరాజేశ్వరి ఆలయానికి చెందిన అధికారిణి పి. జయమ్మ అన్నారు. సమాజం తనుక అందించిన డబ్బునే ఇలా తిరిగిస్తున్నానని అశ్వత్థామ చెప్తోంది. ఎవరూ ఆకలితో అలమటించకూడదని తాను ఆ దేవుడిని ప్రార్థిస్తానని, అదొక్కటే తన కోరిక అని పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

