Vinesh Phogat : విశ్వ క్రీడల్లో పసిడి పోరు ముందు అనర్హతకు గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat)కు భారీ ఊరట. విశ్వ క్రీడల్లో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆమె దాఖలు చేసిన అప్పీల్‌ను అడ్‌హక్ ప్యానెల్‌కు సంబంధించిన క్రీడా కోర్టు స్వీకరించింది. గురువారం మధ్నాహ్నం 3:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 9 :30 గంటలకు) తాము అప్పీల్‌పై వాదనలు వింటామని సదరు కోర్టు తెలిపింది.
ఇంగ్లండ్ కాలమానం ప్రకారం ఆగస్టు 9 శుక్రవారం ఉదయం 10:00 గంటలకు వినేశ్ అనర్హతపై కోర్టు విచారించనుంది. దాంతో, భారత ప్రభుత్వం వినేశ్ తరఫున వాదనలు వినిపించేందుకు హరిష్ సల్వే(Harish Salve)ను నియమించింది. అయితే.. ఆయన తన అంగీకారం తెలపాల్సి ఉంది.
Legend 🇮🇳🙏 @Phogat_Vinesh pic.twitter.com/d5s6st7at0
— geeta phogat (@geeta_phogat) August 8, 2024
ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫోగట్‌కు బుధవారం ఊహించని షాక్ తగిలింది.100 గ్రాముల అదనపు బరువు కారణంగా నిర్వాహకులు ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో, భారమైన హృదయంతో ఆమె రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. అనంతరం అడ్ హక్ ప్యానెల్ క్రీడా కోర్టులో తనకు న్యాయం చేయాలని, గురువారం జరుగబోయే ఫైనల్లో తనను అనుమతించాలని అప్పీల్ చేసింది. కానీ, సదరు కోర్టు ఆలస్యంగా స్పందించింది. సీఏసీ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. క్రీడలకు సంబంధించిన వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తుంటుంది.