Olympics | కాంస్య పతకం నెగ్గిన టీమిండియా.. సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..
Olympics | పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని నెగ్గింది. స్పెయిన్ జట్టును 2-1 తేడాతో ఓడించి భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. భారత జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
Olympics | పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని నెగ్గింది. స్పెయిన్ జట్టును 2-1 తేడాతో ఓడించి భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. భారత జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. హాకీ జట్టు విజయంపై ప్రధాని మోదీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా భారత్‌కు మరో విజయమని ట్వీట్ చేశారు. ‘భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇది మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం. నైపుణ్యం, పట్టుదలకు స్ఫూర్తి ఈ విజయం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ప్రదర్శన చేశారు.
భారత హాకీ బృందం స్ఫూర్తిని చాటింది. ప్రతి భారతీయుడికి హాకీతో మంచి అనుబంధం ఉంది. ఈ విజయానికి మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది. క్రీడాకారులందరికీ అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. మరో వైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ క్రీడా పాలసీ మేరకు పంజాబ్‌కు చెందిన ప్రతి క్రీడాకారుడికి రూ.50లక్షలు ఇస్తామని చెప్పారు. భారత జట్టు విజయంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే సంతోషం వ్యక్తం చేశారు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ని చూడడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిభావంతులైన హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకాన్ని అందించింది. ఇదో చారిత్రక మైలురాయి’ అని పేర్కొన్నారు.
A feat that will be cherished for generations to come!
The Indian Hockey team shines bright at the Olympics, bringing home the Bronze Medal! This is even more special because it is their second consecutive Medal at the Olympics.
Their success is a triumph of skill,…
— Narendra Modi (@narendramodi) August 8, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

