Foreign Ministry | బంగ్లా కొనసాగుతున్న హింసాకాండ.. కీలక వ్యాఖ్యలు చేసిన భారత విదేశాంగ శాఖ
Foreign Ministry | బంగ్లాదేశ్ కొనసాగుతున్న హింసాకాండ మధ్య భారత విదేశాంగశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌కు సంబంధించినంత వరకు బంగ్లాదేశ్ పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ స్పష్టం చేసింది. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఆశిస్తున్నామని పేర్కొంది.
Foreign Ministry | బంగ్లాదేశ్ కొనసాగుతున్న హింసాకాండ మధ్య భారత విదేశాంగశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌కు సంబంధించినంత వరకు బంగ్లాదేశ్ పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ స్పష్టం చేసింది. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఆశిస్తున్నామని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ విదేశాంగ మంత్రి ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకున్నారన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిపై సమాచారం తీసుకుంటున్నామని.. బంగ్లాలోని కొన్ని సంఘాలు మైనారిటీలకు సహాయం చేస్తున్నాయని మాకు సమాచారం అందిందన్నారు. ఆయా చర్యలను స్వాగతిస్తున్నామని.. అయితే, బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని చెబుతున్నామన్నారు. పౌరులందరికీ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేయాలనుకుంటున్నామన్నారు.
రెండు దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు ఇది చాలా ముఖ్యమన్నారు. బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితులపై రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ మళ్లీ బంగ్లాదేశ్‌లో పరిస్థితి దిగజారుతోందన్నారు. సాయంత్రం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం ఉందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో భారత్ తరఫున తమ రాయబారి సైతం పాల్గొంటారన్నారు. బంగ్లాదేశ్ పౌరుల భద్రత భారత ప్రభుత్వానికి, ప్రజలకు అత్యంత ప్రాధాన్యత అని చెబుతున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితికి సంబంధించి బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మధ్య చర్చ జరిగిందన్నారు. బంగ్లాదేశ్, పశ్చిమాసియాలో పరిస్థితి పురోగతిపై ఇరువురు నేతలు చర్చించారన్నారు. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రాజకీయ ఆశ్రయం కల్పించే అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. తక్కువ వ్యవధిలో భారత్‌కు వస్తామని షేక్ హసీనాకు సమాచారం అందించినట్లు మా విదేశాంగ మంత్రి ఇప్పటికే తెలిపారన్నారు. బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. హింసాకాండ కొనసాగుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

