IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్(Vijay Shankar) రికార్డు బ్రేక్ చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత తన సొంత రాష్ట్ట్రానికి చెందిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టుకు ఆడాడు. దాంతో, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) రికార్డును బద్ధలు కొట్టాడీ యంగ్‌స్టర్.
ఐపీఎల్లో 2014లో సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన విజయ్.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ సీఎస్కే గూటికి చేరాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడీ తమిళ తంబీ. దాదాపు 4 వేల రోజుల తర్వాత అతడు తిరిగి చెన్నై జట్టుతో కలిశాడు. ఇంతకుముందు అశ్విన్ 3,974 రోజులకు మళ్లీ పసుపు జెర్సీ వేసుకున్నాడు.
Welcome back Vijay Shankar to Yellove’ly Family 💛 #IPLAuction #WhistlePodu #CSK pic.twitter.com/P2bTq9MRgl
— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) November 24, 2024
ఐపీఎల్లో అరంగేట్రం చేసిన 2014లో విజయ్ శంకర్ ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆరు హాఫ్ సెంచరీలు బాదిన అతడి అత్యధిక స్కోర్.. 63 నాటౌట్. రెండేళ్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మారిన విజయ్.. 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు తరఫున ఆడాడు. ఇక.. 2019లో మళ్లీ సన్‌రైజర్స్ అతడిని కొనుగోలు చేసింది. అనంతరం 2022లో గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీ రూ.1.4 కోట్లకు కొనడంతో.. రూ.1.2 కోట్లకు సొంతం చేసుకుంది.