OTT | ప్రతి వారం కూడా ఇటు థియేటర్లో ఎన్ని సినిమాలు సందడి చేసిన ఓటీటీలోను వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఏప్రిల్ 4 నుంచి సందడి మొదలు కానుంది. ఆర్ మాధవన్, నయనతార, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘టెస్ట్’. శుక్రవారం (ఏప్రిల్ 4వ తేదీ) నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. థియేటర్లలో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాని అనూహ్యంగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.
ఇక ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, నటి ఝాన్సీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్. ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ’90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ప్రొడ్యూస్ చేసిన నవీన్ మేడారం ఈ సిరీస్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇక ఏప్రిల్ మొదటి వారంలో విడుదల అవుతున్న వెబ్ సిరీస్లలో తనికెళ్ల భరణి, తులసి, బాలాదిత్య, సోనియా సింగ్, గీతా భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన యాంథాలజీ ‘కథా సుధ’ ఒకటి. ఐదు కథల సంకలనంగా ఈ సిరీస్ రూపొందింది. ప్రతి ఆదివారం ఒక్కొక్క కథను స్ట్రీమింగ్ చేయనుండగా, ఏప్రిల్ 6న ఈటీవీ విన్ ఓటీటీలో తొలి కథ విడుదల కానుంది.
మలయాళ హీరో టోవినో థామస్, సౌత్ క్వీన్ త్రిష ప్రధాన పాత్రలలో నటించిన మలయాళ సినిమా ‘ఐడెంటిటీ. జనవరి 31 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషలలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 2 నుంచి స్ట్రీమింగ్ రెడీ అయింది. నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన జియో హాట్స్టార్ వెబ్ సిరీస్ ‘టచ్ మీ నాట్’. ఇందులో ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, తెలుగు అమ్మాయి కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మధుశాల. సస్పెన్స్ డ్రామా, కామెడీతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించడంతో పాటు నిర్మించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమా ‘కింగ్స్టన్. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. జియో హాట్స్టార్లో ఏప్రిల్ 1న ‘జరూర్ #2’ వెబ్ సిరీస్, 3న ‘రియల్ పెయిన్’ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. సోనీ లీవ్ ఓటీటీలో ‘చమక్ సీజన్ 2’ శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచి స్ట్రీమింగ్ కానుంది.