L2 Empuraan | మలయాళం, తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో సూపర్ క్రేజ్ ఉన్న స్టార్ సెలబ్రిటీలు మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ (Mohanlal), పృథ్విరాజ్ సుకుమారన్ (Pridviraj Sukumaran). ఈ ఇద్దరు పాన్ ఇండియా యాక్టర్ల కాంబోలో వచ్చిన చిత్రం L2 : Empuraan. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటించారు.
మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ వసూళ్లతో స్క్రీనింగ్ అవుతోంది. కాగా మోహన్ లాల్ ఎంపురాన్ సినిమాపై వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో హిందువులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆర్ఎస్ఎస్ సహా పలువురు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడులో మరో వివాదం తెరపైకి వచ్చింది.
ఎల్2 : ఎంపురాన్ సినిమాలో ముళ్లై పెరియార్ డ్యామ్‌పై వచ్చే సన్నివేశాలపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. డ్యామ్‌పై వచ్చే సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ సన్నివేశాలు తొలగించకపోతే థియేటర్లను ముట్టడిస్తామంటున్నారు. మోహన్ లాల్ ఆస్తులను ధ్వంసం చేస్తామని.. నిర్మాతలకు సంబంధించిన కంపెనీలపై దాడి చేస్తామని రైతుల సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో మరి పృథ్విరాజ్ సుకుమారన్ అండ్ మోహన్ లాల్ టీం ఎలా స్పందిస్తుందనేది చూడాలి మరి.
ఈ మూవీలో ఇంద్రజిత్ సుకుమారన్, సనియా అయ్యప్పన్, సాయికుమార్, బజ్జు సంతోష్, ఫజిల్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.
Prabhas Spirit | మెక్సికోలో షూటింగ్.. ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ పంచుకున్న సందీప్ వంగా
Lucifer 2 Empuraan | మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై 17 సెన్సార్ కట్స్
Pawan Kalyan | ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఇక సమయం లేదు మిత్రమా..!