Veterans Retirement | వంద టెస్టులు ఆడినా పట్టించుకోరా.. దిగ్గజ ఆటగాళ్లకు ఘనంగా వీడ్కోలు పలకలేరా..?
Veterans Retirement : భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన క్రికెటర్లు ఒక్కరొక్కరుగా వీడ్కోలు పలుతుకున్నారు. ఈ నేపథ్యంలో.. దేశం తరఫున వందకు పైగా టెస్టులు ఆడిన రోహిత్, కోహ్లీ, పుజారాలకు అద్బుతంగా సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిందని మాజీ సెలెక్టర్ అభిప్రాయపడ్డాడు.
Veterans Retirement : భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన క్రికెటర్లు ఒక్కరొక్కరుగా వీడ్కోలు పలుతుకున్నారు. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోగా.. ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) మొత్తంగా మూడింటికీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో.. అత్యంత సీనియర్ ఆటగాళ్లు అయిన వీళ్లకు ఘనమైన వీడ్కోలు లభించకపోవడంపై మాజీలు మండిపడుతున్నారు.
దేశం తరఫున వందకు పైగా టెస్టులు ఆడిన కోహ్లీ, పూజారాలకు అద్బుతంగా సెండ్ ఆఫ్ ఇవ్వాల్సింది అని అభిప్రాయపడ్డాడు మాజీ సెలెక్టర్ కృష్టమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth). వెటరన్ క్రికెటర్ల విషయంలో ఏమీ పట్టనట్టుగా ఉంటున్న బీసీసీఐ తీరుని ఆయన తీవ్రంగా విమర్శించాడు.

ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు టాటా చెప్పేయగా.. ఐదు రోజులకే కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. సుదీర్ఘ కాలం ఆడి.. కెప్టెన్‌గా జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన ఇరువురికి ఘనంగా, గౌరవపూర్వకంగా వీడ్కోలు పలకాల్సిందని పలువురు బీసీసీఐకి సూచించారు. తాజాగా నయావాల్ పుజారా కూడా రెండేళ్లుగా టెస్టు ఛాన్స్ కోసం నిరీక్షించి అల్విదా చెప్పాడు. దాంతో.. ఈ ముగ్గురికి గొప్పగా వీడ్కోలు పలకాల్సిన బీసీసీఐ మిన్నకుండిపోవడం సరికాదని యూట్యూబ్ ఛానెల్ వేదికగా శ్రీకాంత్ మండిపపడ్డాడు.
పుజారా, రోహిత్, కోహ్లీ

‘దేశం తరఫున 100 టెస్టులు ఆడడం అంటే మామూలు విషయం కాదు. నూరు మ్యాచులు ఆడినవాళ్లంతా గొప్ప ఆటగాళ్లే. అలాంటి వాళ్లకు గౌరవపూర్వకంగా ఘనమైన వీడ్కోలు పలకాలి. అయితే.. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ సమయంలో బీసీసీఐకి ముందస్తు సమాచారం లేదనే మాటతో ఏకీభవిస్తాను. కానీ.. అధికారులు వాళ్లతో మాట్లాడాల్సింది. కానీ అలా చేయలేదు. కోహ్లీ మరో రెండేళ్లు టెస్టులు ఆడాల్సింది.
‘ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్ డ్రా చేసుకున్నాం’ కాబట్టి కోహ్లీ లేకున్నా పర్లేదని కొందరు అంటున్నారు. ఇప్పుడు పుజారా సైతం పునరాగమనం ఆశలు సన్నగిల్లడంతో నిరాశతో వీడ్కోలు ప్రకటన చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో తనకు చోటు లభిస్తుందని ఆశించిన అతడికి సెలెక్టర్లు షాకిచ్చారు. రిటైర్మెంట్ ఆలోచనతో ఉన్న అతడితో మాట్లాడి ఒక టెస్టు అయినా ఆడించి ఉంటే బాగుండు. కానీ, సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు పూజారాను అడిగిన పాపాన పోలేదు’ అని శ్రీకాంతో నిప్పులు చెరిగాడు.
Wearing the Indian jersey, singing the anthem, and trying my best each time I stepped on the field – it’s impossible to put into words what it truly meant. But as they say, all good things must come to an end, and with immense gratitude I have decided to retire from all forms of… pic.twitter.com/p8yOd5tFyT
— Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2025
చరిత్రాత్మక విజయాల్లో..
సుదీర్ఘ ఫార్మాట్లో భారత్‌కు ఆడిన గొప్ప ఆటగాళ్లలో కోహ్లీ, పుజారా, రోహిత్ కచ్చితంగా ఉంటారు. టాపార్డర్‌లో విలువైన భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్న ఈ ముగ్గురు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో చరిత్రాత్మక విజయాల్లో భాగమయ్యారు. టెస్టుల్లో టీమిండియాను నంబర్ 1గా నిలిపిన కోహ్లీ 123 మ్యాచ్‌లు ఆడగా.. హిట్‌మ్యాన్ 67, నయావాల్ 103 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

