జలంధర్: పంజాబీ బాడీబిల్డర్, బాలీవుడ్ నటుడు వరీందర్ సింగ్ (47) శుక్రవారం హఠాన్మరణం చెందాడు. జలంధర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అతడు గుండెపోటుతో మరణించినట్టు వరీందర్ బంధువులు తెలిపారు. 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న అతడు.. మిస్టర్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో రెండో స్థానం సంపాదించాడు.
ప్రపంచంలోనే వెజిటేరియన్ ప్రొఫెషనల్ బాడీబిల్డర్‌గా గుర్తింపుపొందిన అతడు కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3లోనూ వరీందర్ కీలకపాత్ర పోషించాడు.