WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో నిరాశపరుస్తున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు బిగ్ షాక్. నిలకడలేమితో సతమతమవుతున్న ఆ జట్టు ఓపెనర్ జి.కమలిని (G.Kamalini) సేవల్ని కోల్పోనుంది. గాయం కారణంగా ఈ యువ ఓపెనర్ డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగింది. గాయం కారణంగా తను ముంబై తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో లేదు. దాంతో.. ఆమె స్థానంలో స్పిన్ సంచలనంను తీసుకుంది ముంబై.
డబ్ల్యూపీఎల్‌లో సంచలన ఆటతో వార్తల్లో నిలిచిన జి.కమలిని అనుకోకుండా టోర్నీకి దూరమైంది. ఐదు మ్యాచుల్లో 75 పరుగులతో సత్తా చాటిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. గాయం కారణంగా లీగ్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానంలో వైష్ణవీ శర్మ (Vaishnavi Sharma)ను తీసుకుంది ఫ్రాంచైజీ.
Squad update 🚨
Vaishnavi Sharma replaces G Kamilini who is set to miss the remainder of #TATAWPL due to injury.
Full details in the article 👉 https://t.co/IasOX1dBfB— Mumbai Indians (@mipaltan) January 20, 2026
రూ.30 లక్షల కనీస ధరతో ఈ యువ స్పిన్నర్‌తో ఒప్పందం చేసుకుంది ముంబై. ఈ విషయాన్ని మంగళవారం ఎక్స్ వేదికగా ముంబై యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ సేన ఐదింటా రెండు విజయాలతో.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడిస్తే ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగపడనున్నాయి.
Paltan, let’s give a super loud welcome to the newest member of our family! 💙
Vaishnavi Sharma will replace the injured Kamalini for the remainder of the #TATAWPL 2026 season. pic.twitter.com/s9kC77rWkJ
— Mumbai Indians (@mipaltan) January 20, 2026
శ్రీలంకతో చివరి టీ20లో అరంగేట్రం చేసిన కమలిని డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్లో అదరగొట్టింది. ముంబై ఇండియన్స్‌కు శుభారంభాలు ఇస్తూ.. భావి తారగా ప్రశంసలు అందుకుంది. వైష్ణవీ విషయానికొస్తే.. శ్రీలంకపై తిప్పేసిన ఈ మధ్యప్రదేశ్ అమ్మాయి.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైంది. ఇప్పటికే పొట్టి క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ సెన్సేషన్.. వన్డేల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది.