Vaibhav Suryavanshi : ఐపీఎల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీతో ప్రభంజనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) రికార్డుల దుమ్ముదులుపుతున్నాడు. మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగే ఈ కుర్రాడు… ఇప్పుడు ఏకంగా గూగుల్లోనూ ట్రెండ్ సెట్టరయ్యాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కాదని.. ఈ చిచ్చరపిడుగు గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానరంలో నిలిఆడు. ఈ ఏడాది రెండు శతకాలు బాదిన వైభవ్.. అత్యధికమంది వెతికిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు 14 ఏళ్ల వైభవ్. మహిళల వన్డేప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ బాదిన జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) గురించి కూడా తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు.
పద్నాలుగేళ్లకే ఐపీఎల్ సెంచరీతో వైరలైన వైభవ్ సూర్యవంశీ తన విధ్వసంక ఆటతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈపై మెరుపు శతకం బాదిన వైభవ్.. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీలోనూ 32 బంతుల్లోనే వందతో చరిత్ర సృష్టించాడు. చిన్నవయసులోనే అసాధారణ ఆటతో అందర్నీ ఫిదా చేస్తున్న వైభవ్.. వివరాల కోసం ఆన్లైన్లో ఎక్కువమంది వెతికారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య రెండో స్థానంలో ఉన్నాడు.
The nation can’t stop Googling him! 👏🏼
Vaibhav Suryavanshi tops the list of most-searched personalities on Google in India in 2025. 🔍🔥#Cricket #VaibhavSuryavanshi #Sportskeeda pic.twitter.com/hZULzXEdD8
— Sportskeeda (@Sportskeeda) December 5, 2025
భారత టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మూడో స్థానంలో ఉండగా.. తెలుగు కుర్రాడు షేక్ రషీద్ నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకంతో భారత జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్ టాప్-5లో చోటు దక్కింది. ముంబై కుర్రాడు ఆయుశ్ మాత్రే(6వ స్థానం), భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(7వ స్థానం), కరుణ్ నాయర్(8వ స్థానం), విఘ్నేష్ పుతుర్ల కోసం కూడా నెటిజన్లు ఈ ఏడాది గూగుల్‌లో తెగ వెతికారు.
#Updates | 2025ம் ஆண்டு கூகுளில் இந்திய அளவில் அதிகம் தேடப்பட்ட நபர்கள் பட்டியலில் வைபவ் சூர்யவன்ஷி முதலிடம்!
டாப் 10ல் ஷேக் ரஷீத், ஆயுஷ் மாத்ரே, உர்வில் படேல் ஆகிய 3 CSK வீரர்கள் இடம்பெற்றுள்ளனர்.#SunNews | #GoogleTrends | #VaibhavSuryavanshi pic.twitter.com/eUyVkB0yQd
— Sun News (@sunnewstamil) December 4, 2025
స్పోర్ట్స్ ఈవెంట్స్ విషయానికొస్తే.. ఫిఫా వరల్డ్‌కప్, ఆసియా కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్, రైడర్ కప్ టాప్ -లో ఉన్నాయి. మొత్తంగా చూస్తూ.. ఐపీఎల్(IPL), గూగుల్ జెమిని, ఆసియా కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రో-కబడ్డీ లీగ్‌కు వరుసగా తొలి ఐదు స్థాన్లాలో నిలిచాయి.