బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో యువ భారత జట్టు అదరగొడుతున్నది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత అండర్-19 టీమ్.. ఆస్ట్రేలియా అండర్-19తో జరుగుతున్న యూత్ టెస్టు (మొదటిది)లో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది.
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (86 బంతుల్లో 113, 9 ఫోర్లు, 8 సిక్సర్లు) దూకుడైన శతకానికి తోడు మిడిలార్డర్లో వేదాంత్ త్రివేది (140) భారీ స్కోరు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 428 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 243 రన్స్‌కే ఆలౌట్ అవగా భారత జట్టుకు 185 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది.