దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో.. ఇండియన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరీ చీప్‌గా ఔటయ్యాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే స్కోరు చేసి నిష్క్రమించాడు. వారం క్రితమే 13 ఏళ్ల వైభవ్(Vaibhav Suryavanshi).. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన విషయం తెలిసిందే. ఆ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.1.1 కోటి పెట్టి కొన్నది. పాక్‌తో మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. క్రీజ్‌లో నిలదొక్కులేకపోయాడు. క్రీజ్‌లో ఉన్నంతసేపు అతను ఈజీగా ఫీలవ్వలేదు. పాక్ స్పీడ్ బౌలర్ అలీ రాజా బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 281 రన్స్ స్కోర్ చేసింది. షాజైబ్ ఖాన్ 159 రన్స్ చేశాడు. ప్రస్తుతం ఇండియా జట్టు 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 40 రన్స్ చేసింది.