Vaibhav Suryavanshi | ఢిల్లీ: ఐపీఎల్లో ఆడిన తొలి సీజన్లో అంచనాలకు మించి రాణించిన యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రెకు బంపరాఫర్ దక్కింది. త్వరలో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత అండర్-19 జట్టులో వీరికి చోటు లభించింది. చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో అతడి స్థానంలో వచ్చిన ఆయుష్.. తనదైన ఆటతీరుతో ఆ జట్టు భావి ఓపెనర్‌గా ప్రశంసలందుకున్నాడు.
ఇక ఐపీఎల్లో 14 ఏండ్లకే అరంగేట్రం చేయడంతో పాటు గుజరాత్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్‌నూ సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. జూన్ 24 నుంచి మొదలుకాబోయే ఈ పర్యటనలో భారత జట్టు.. ఇంగ్లండ్ అండర్-19తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు రెండు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడనుంది.