BCCI : అండర్-19 క్రికెట్లో, ఐపీఎల్లో ప్రకంపనలు రేపుతున్న వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) భారత ‘ఏ’ జట్టులోకి వచ్చేశాడు. ధనాధన్ ఆటతో ప్రపంచస్థాయి బౌలర్లను భయపెడుతున్న ఈ చిచ్చరపిడుగు శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. ముక్కోణపు సిరీస్ కోసం గురువారం సెలెక్టర్లు తిలక్ వర్మ (Tilak Varma) కెప్టెన్‌గా పదిహేను మందితో కూడిన బృందాన్ని ప్రకటించారు. వైభవ్‌తో పాటు ఐపీఎల్లో మెరుస్తున్న నిశాంత్ సింధు, అన్షుల్ కంబోజ్‌లు స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.
పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ అనంతరం భారత కుర్రాళ్లు శ్రీలంకలో అడుగు పెట్టనున్నారు. జూన్‌లో శ్రీలంక గడ్డపై భారత్, అఫ్గనిస్థాన్ మధ్య జరుగనున్న ముక్కోణపు సీరీస్‌లో తమ తడాఖా చూపించనున్నారు. ఈ ట్రై సిరీస్ కోసం గురువారం సెలెక్టర్లు తిలక్ వర్మ సారథిగా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా స్క్వాడ్‌ను ప్రకటించారు. గత ఏడాది నుంచి శతకాల మోతతో ఔరా అనిపిస్తున్న వైభవ్.. పంతొమ్మిదో సీజన్లో అదరగొడుతున్న ప్రియాన్స్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లు టాపార్డర్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు. సూర్యాన్ష్ షెడ్గే, నిషాంత్ సింధుతో పాటు.. పేసర్లు అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్లకు చోటు లభించింది.
🚨 News 🚨
India A squad for ODI tri-series in Sri Lanka announced.
The upcoming tri-series is scheduled to be held in June, 2026.
More Details ▶️ https://t.co/ZmL2u1boAW pic.twitter.com/7WXzZeeUFq
— BCCI (@BCCI) May 14, 2026
సిరీస్ విషయానికొస్తే.. జూన్ 9న ఆతిథ్య శ్రీలంకను దంబుల్లా స్టేడియంలో భారత ఏ జట్టు ఢీ కొట్టనుంది. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ సిరీస్‌లో టాప్-2లో నిలిచిన జట్లు జూన్ 21న ఫైనల్లో తలపడతాయి. ఈ పర్యటనలోనే లంక ఏ జట్టుతో టీమిండియా రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లకు స్క్వాడ్‌ను ప్రకటించాల్సి ఉంది.

భారత ‘ఏ’ జట్టు స్క్వాడ్ : తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రియాన్ పరాగ్(వైస్ కెప్టెన్), అయుశ్ బదొని, నిషాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, కుమార్ కుషగ్ర(వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్.