INDU19 vs BANU19 : అండర్-19 ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లో భారత జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వర్షం అంతరాయం నడుమ సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడుతూ వైభవ్ సూర్యవంశీ(72) శుభారంబిచ్చాడు. కానీ, మిడిలార్డర్ తడబాటు కారణంగా 53కే మూడు కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే.. అభిగ్యాన్ కుందు(80) సమయోచిత ఇన్నింగ్స్‌తో భారత స్కోర్ 200 దాటించాడు. కుందు అర్ధ శతకంతో కోలుకున్న ఆయుష్ మాత్రే సేన49 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌటయ్యింది.
జింబాబ్వే వేదికగా జరుగుతున్న పురుషుల అండర్-19 ప్రపంచకప్‌లో అదిరే బోణీ కొట్టిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడిన టీమిండియాక శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ ఆయుష్ మాత్రే(6)ను ఔట్ చేసి షాకిచ్చాడు ఫాహద్(5-38). ఆ తర్వాతి బంతికే వేదాంత్ త్రివేది(0)ని డకౌట్ చేయడంతో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ(72). కానీ,.. తమిమ్ ఓవర్లో విహాన్ మల్హోత్రా వెనుదిరగడంతో 53కే మూడు వికెట్లు పడ్డాయి. ఆ దశలో వైభవ్ తన స్టయిల్ విధ్వంసంతో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు.
Vaibhav Suryavanshi 50* off (30) balls included 5 Fours & 3 Sixes against Bangladesh in U19 World Cup.
— Cricupsdaily (@cricupsdaily) January 17, 2026
సెంచరీ దాటించిన వైభవ్ 115వద్ద ఔటయ్యాక.. కనిష్క్ చౌహన్ (28), టెయిలెండర్ల సాయంతో వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు(80) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివరి దాకా నిలబడిన అతడు హాఫ్ సెంచరీతో స్కోర్ 200 దాటించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. 48వ ఓవర్లో దీపేశ్ దేవేంద్రన్(11) 4, 6 బాదాడు. అదే ఊపులో పెద్ద షాట్ ఆడబోయిన అతడు బౌండరీ వద్ద దొరికిపోవడంతో 238 వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది.
Grit and maturity from the young gun! 💙
Abhigyan Kundu’s composed 80(112) guided India to a competitive total. 👏#ICCMensU19WC | #INDvBAN 👉 LIVE NOW ➡️ https://t.co/DGP23ftABG pic.twitter.com/tz8lHOaVEU
— Star Sports (@StarSportsIndia) January 17, 2026