మహబూబ్‌నగర్, జనవరి 10 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలకు వివిధ రాష్ర్టాల నుంచి జట్లు తరలిరాగా, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు.
బాలికల విభాగంలో ఉత్తరప్రదేశ్ జట్టు 29-3 తేడాతో ఝార్జండ్పై ఘన విజయం సాధించగా, పంజాబ్ 23-01 తేడాతో నవోదయ విద్యాసమితిపై, గుజరాత్ 14-05 తేడాతో ఉత్తరాఖండ్‌పై, బాలుర విభాగంలో డీఏవీ 17-16 తేడాతో మధ్యప్రదేశ్‌పై, ఢిల్లీ 26-07 పుదుచ్చేరిపై గెలిచి ముందంజ వేశాయి.