Hulk Hogan : ఫైట్‌తోనే కాదు ముచ్చటైన మీసాలతోనూ పాపులర్ అయిన హల్క్ హొగన్ (Hulk Hogan) కన్నుమూశాడు. అమెరికాకు చెందిన హల్క్ గురువారం గుండెపోటు (Heart attack)తో మరణించాడు. 1980ల్లో ఓ వెలుగు వెలిగిన హల్క్ 71 ఏళ్ల వయసులో ఫ్లొరిడాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణవార్తను డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ధ్రువీకరించింది. డబ్ల్యూడబ్ల్యూ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఒకడైన లెజెండరీ రెజ్లర్‌ను కోల్పోయామని సంతాపం తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.
హల్క్ అసలు పేఉరు టెర్నీ జెనె బొల్లయ. 1935 ఆగస్టు 11న జార్జియాలోని అగస్తాలో జన్మించాడు హల్క్. రెజ్లింగ్ మీద ఆసక్తి పెంచుకున్న ఆయన 1970లో ప్రొఫెషన్‌గా బరిలోకి దిగాడు. 1980వ దశకంలో ఎదురులేని మల్లయోధుడిగా అవతరించిన హల్క్.. తన హ్యాండిల్ బార్ మీసాలతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్లోబల్ సూపర్ స్టార్‌గా మారిన ఆయన ‘డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్’ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు.
WWE legend Hulk Hogan has passed away at the age of 71 pic.twitter.com/4ZyRODXKyP
— Pubity (@pubity) July 24, 2025
రింగ్‌లోకి దిగడమే ఆలస్యం ప్రత్యర్థులకు దడపుట్టించే హల్క్.. రింగ్ అవతల మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేవాడు. ఆయన జీవిత సిద్ధాంతం కూడా చాలా సింపుల్. ‘కష్టపడండి. ప్రార్దనలు చేయండి. విటమిన్లతో కూడిన ఆహారం తినండి. మీపై మీరు నమ్మకం కలిగి ఉండండి’ అని తన అభిమానులకు.. ముఖ్యంగా పిల్లలతో తరచూ చెప్పేవాడు హల్క్.