Pawan Kalyan | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటించిన ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. హరిహరవీరమల్లు పార్ట్-1 నేడు (జులై 24న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. తొలి రోజు మిక్స్డ్ టాక్‌తో స్కీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తొలిసారి సక్సెస్ మీట్‌కు హాజరయ్యాడు పవన్ కల్యాణ్.
సక్సెస్ మీట్లో హరిహరవీరమల్లు ప్రమోషన్స్ గురించి చెబుతూ.. రెండు రోజులు మాట్లాడినంత 29 ఏండ్ల సినీ జీవితంలో 10 శాతం కూడా మాట్లాడలేదన్నాడు పవన్ కల్యాణ్. విధి నన్ను హీరోగా, రాజకీయ నాయకుడిగా తీసుకొచ్చిందన్నాడు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై స్పందిస్తూ.. హరిహరవీరమల్లు సినిమాను బాయ్‌కాట్ చేద్దామని బెదిరించినా బెదరలేదు. నా సినిమా మిమ్మల్ని అంత భయపెట్టిందా..? వాళ్లు తిట్టేది నన్ను కదా మీరెందుకు బాధపడతారు.. నా అభిమానులు సున్నితంగా ఉండొద్దు. అభిమానులు మీ జీవితాన్ని ఆస్వాదించండి. నేను కదా దెబ్బలు తినేది.. మీకెందుకు..? నెగెటివ్ ప్రచారంపై సోషల్ మీడియాలో ఎలా దాడి చేయాలో అలా చేయండని సూచించాడు.
అంతేకాదు హరిహరవీరమల్లు రెండో భాగం 20-30 శాతం పూర్తయిందంటూ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశాడు. నా జీవితంలో తొలిసారి సక్సెస్ మీట్‌కు హాజరయ్యా. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పంచాయితీలు చేసి సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. నా జీవితకాంలో ఏదీ తేలిగ్గా దొరకలేదు. నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. డిప్యూటీ సీఎం కదా.. సినిమా సులభంగా విడుదలవుతుందనుకున్నా. గత వారం రోజులుగా నిద్రపోలేదు. ఈ రోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే అది నా అభిమానులు ఇచ్చిన బలమే కారణమన్నాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Nithya Menen | తనను రతన్ టాటాతో పోల్చుకున్న నిత్యమీనన్.. ఇంతకీ ఏ విషయంలోనో తెలుసా..?
Ustaad Bhagat Singh | వారంలో పూర్తి.. ఉస్తాద్ భగత్ సింగ్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్