Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish shankar) కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. గబ్బర్ సింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ కాంబోలో వస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
కాగా హరిహరవీరమల్లు జులై 24న విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. తాను నటిస్తోన్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ మీడియాతో చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయం చెప్పి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఫ్యాన్స్, ఫాలోవర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ గురించి లీక్ ఇచ్చేసి క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కొనసాగుతుందని.. తన పార్ట్‌కు సంబంధించిన చిత్రీకరణ ఐదారు రోజుల్లో పూర్తవుతుందని చెప్పాడు పవన్ కల్యాణ్. అంటే పవన్ కల్యాణ్ మరోవైపు ఉస్తాద్ భగత్‌సింగ్‌ను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడని అర్థమవుతుంది.
తాజా కామెంట్స్‌తో పవన్ కల్యాణ్ తన సినిమాల కమిట్మెంట్స్ను పూర్తి చేసి.. రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నాడంటూ ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా శ్లోక పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్నఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇంకేంటి మరి రానున్న రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్‌కు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రెడీ అవుతున్నాయన్నమాట.
Vidya Balan | కొత్తగా తల్లి అయిన వారికి తక్కువ పని గంటలుండాలి : విద్యాబాలన్
Boney Kapoor | శ్రీదేవి భర్తలో ఇంత చేంజ్ ఏంటి..జిమ్‌కే వెళ్లకుండా 25 కేజీలు తగ్గిన బోనీ కపూర్