Nithya Menen | విజయ్‌సేతుపతి, నిత్యమీనన్ కాంబోలో వస్తోన్న చిత్రం సర్ మేడమ్. జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది నిత్యమీనన్. ఈ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్షిప్స్, వ్యక్తిగత ప్రయాణానికి సంబంధించి భావోద్వేగ అంశాలను షేర్ చేసుకుంది.
జీవితంలో ప్రేమ, సోల్‌మేట్ (భాగస్వామి) వంటి అంశాలను తాను మొదట్లో గాఢంగా నమ్మేదానినని.. జీవిత భాగస్వామిని కలిగి ఉండటం చాలా అవసరమని భావించేదాన్నని చెప్పింది. అంతేకాదు సోల్‌మేట్‌ను వెతికే ప్రయత్నం కూడా చేసినట్టు పేర్కొంది. అయితే కాలం మారుతున్న కొద్దీ తన దృక్పథం మారిపోయిందని.. ఒంటరిగా ఉండటం పూర్తిగా సరైందేనన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. జీవితం వేరొకరిపై ఆధారపడవలసిన అవసరం లేదని ఇప్పుడు భావిస్తున్నానని.. ఒంటరిగా ఉండటం లోపం కాదు అంటూ స్పష్టం చేసింది నిత్యమీనన్.
ఈ క్రమంలో నిత్యమీనన్ తనను తాను రతన్ టాటా (దివంగత పారిశ్రామిక వేత్త)తో పోల్చుకుంది. రతన్ టాటా కూడా ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు కదా.. పెళ్లి చేసుకోకపోవడం పెద్ద విషయం కాదు. కొన్నిసార్లు ఒంటరితనం వచ్చి పోవచ్చు.. కానీ ఇప్పుడు తనకు స్వేచ్చ, మనశ్శాంతి చాలా అర్థవంతమైనవంటూ చెప్పింది నిత్యమీనన్. కొన్ని వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అనుభవాలు తన ప్రస్తుత మనస్తత్వాన్ని ఏర్పరచాయన్న నిత్యమీనన్.. జీవితంలో ప్రతిదీ ఒక కారణంతోనే జరుగుతుందని తన అనుభవాలు నేర్పించాయని చెప్పుకొచ్చింది.
Vidya Balan | కొత్తగా తల్లి అయిన వారికి తక్కువ పని గంటలుండాలి : విద్యాబాలన్
Boney Kapoor | శ్రీదేవి భర్తలో ఇంత చేంజ్ ఏంటి..జిమ్‌కే వెళ్లకుండా 25 కేజీలు తగ్గిన బోనీ కపూర్