Hari Hara Veeramallu | టాలీవుడ్ ప్రేక్షకులు ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. సినిమా నుండి విడుదలైన టీజర్, గ్లింప్స్, పాటలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ప్రమోషనల్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఎట్టకేలకి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ అభిమానులకి అయితే ఈ సినిమా తెగ నచ్చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ గురించి తెగ ముచ్చటించుకుంటున్నారు.
ఇక ప్రీమియర్ షోలో స్క్రీన్ మీద ఓటీటీ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ వీడియో అని ప్రకటించారు. భారీ ధరకు రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత, హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రైమ్‌లోకి అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణంగా, ఓ సినిమా థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. అదే లెక్కన చూస్తే, హరిహర వీరమల్లు సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, థియేటర్లలో ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుండగా, ఈ సినిమాని మేకర్స్ మరింత తొందరగా తీసుకొచ్చే అవాకశం ఉందా అనేది చూడాలి.
హరిహర వీరమల్లు చిత్రాన్ని క్రిష్- జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపించి మెప్పించారు. ఇక సినిమాకి కీరవాణి సంగీతం ప్రాణంగా నిలిచింది. సినిమా డల్ అవుతుంది అనుకున్న సమయంలో తన సంగీతంతో లేపారు. ప్రీమియర్ షో ఇప్పటికే పూర్తి కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ వస్తుంది. మరి ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కగా, అంతటా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.