హైదరాబాద్, ఆట ప్రతినిధి : సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో గుజరాత్ సారథి ఉర్విల్ పటేల్ (37 బంతుల్లో 119 నాటౌట్, 12 ఫోర్లు, 10 సిక్స్‌లు) సర్వీసెస్ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు. జింఖానా గ్రౌండ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ ఊచకోతతో సర్వీసెస్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్.. 12.3 ఓవర్లలోనే దంచేసింది.
31 బంతుల్లోనే అతడు శతకం బాదడం గమనార్హం. ఇక మధ్యప్రదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్.. 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్.. 144/9కే పరిమితమవగా లక్ష్యాన్ని హైదరాబాద్ 18.1 ఓవర్లలో పూర్తిచేసింది.