Women’s Delhi Premier League : మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్(North Delhi Strikers) చాంపియన్‌గా అవతరించింది. ఉపాసన యాదవ్(114) శతకంతో గర్జించగా నార్త్ ఢిల్లీ జట్టు సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠ రేపిన ఫైనల్లో ఉపాసన ధాటికి సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్(South Delhi Superstarz) బౌలర్లు చేష్టలుడిగిపోయారు. అనంతరం భారీ ఛేదనలో సౌత్ ఢిల్లీ బ్యాటర్ తనీషా సింగ్(72) చివరిదాకా పోరాడింది. కానీ, చివరకు నార్త్ ఢిల్లీ 10 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ కొల్లగొట్టింది.
మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ఉపాసన యాదవ్(114 67 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ బౌలర్లను ఉతికారేస్తూ సెంచరీతో మెరిసింది. ఆరంభ సీజన్లో తొలి శతకం నమోదు చేసిన ఉపాసన జట్టుకు కొండంత స్కోర్ అందించింది. ఆమె విజృంభణతో నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
👑 Presenting the 𝐐𝐮𝐞𝐞𝐧𝐬 of #AdaniDelhiPremierLeagueT20! ✨
The 𝐍𝐨𝐫𝐭𝐡 𝐃𝐞𝐥𝐡𝐢 𝐒𝐭𝐫𝐢𝐤𝐞𝐫𝐬 are crowned 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 of the Women’s #AdaniDPLT20 🏆🤩#DilliKiDahaad pic.twitter.com/PQK4V4zBSZ
— Delhi Premier League T20 (@DelhiPLT20) September 8, 2024
Upasana Yadav saved her best for last! 😉
The first-ever 💯 by a female player in the Women’s League Finale of #AdaniDPLT20 🎇#AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad @delhi_cricket @JioCinema @Sports18 pic.twitter.com/a8tJH2dzHN
— Delhi Premier League T20 (@DelhiPLT20) September 8, 2024
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ కూడా ధాటిగానే ఆడింది. ఓపెనర్లు ఛావి గుప్తా(20), శ్వేతా సెహ్రావత్(13)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ దశలో తనీసా సింగ్(72) కీలక ఇన్నింగ్స్ ఆడింది. రియా సోని(0తో కలిసి దంచేసిన ఆమె హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించే ప్రయత్నం చేసింది.
Tanisha delivers a fighting half-century in the finale!💪🔥#AdaniDelhiPremierLeagueT20 #AdaniDPLT20 #DilliKiDahaad pic.twitter.com/6WnZuMN8gF
— Delhi Premier League T20 (@DelhiPLT20) September 8, 2024
కానీ.. నార్త్ ఢిల్లీ బౌలర్లు ఈ ఇద్దరినీ వెనక్కి పంపి సౌత్ ఢిల్లీని కష్టాల్లోకి నెట్టారు. దాంతో, ఆ జట్టు 169 పరుగులకే పరిమితమైంది. 10 పరుగుల తేడాతో జయభేరి మోగించిన నార్త్ ఢిల్లీ తొలి సీజన్ చాంపియన్‌గా నిలిచింది.