అమరావతి : రెండు రోజులుగా రాజమహేంద్రవరం(Rajamahendravaram) శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతపులి(Cheetah) తో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ్లలో కనిపిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా గాని దాని జాడ తెలియడం లేదు. సీసీ కెమెరాల్లో (CC Camera) రికార్డు అవుతున్న సీసీ ఫుటేజీల బట్టి చిరుత శివారు ప్రాంతాల్లో నే సంచరిస్తుందని గుర్తించారు. దీంతో అధికారులు శివారువాసులకు హెచ్చరికలు జారీ చేశారు.
రాజానగరం మండలం దివాన్ చెరువు పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ (Reserv forest) పరిసరాల్లో జాతీయ రహదారి- 16కు ఇరువైపులా విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. చిరుత కదలిలకపై మరింత నిఘా పెట్టిన అటవీ అధికారులు 50 ట్రాప్ కెమెరాలు, నాలుగు బోన్లు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
శివారు ప్రాంతాల వాసులు సాయంత్రం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని డీఎఫ్వో భరణి కోరారు. రిజర్వ్ ఫారెస్ట్ పొలాల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళ పొలాల్లో ఒంటరిగా పడుకోవద్దని సూచించారు. త్వరలోనే చిరుతను బంధిస్తామని పేర్కొన్నారు .