Siddipet | ముగ్గురు యువకుల లైంగిక దాడి.. గర్భం దాల్చిన బాలిక
Siddipet | సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Siddipet | సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సిద్దిపేట ఏసీపీ మధు వెల్లడించారు.
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. బాలికకు మాయమాటలు చెప్పి దుబ్బాక మండలానికి చెందిన ఒక యువకుడు, అక్బర్పేట-భూంపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువకులు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే మూడు నెలల కిందట బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాలికను ఆమె తల్లి సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలికను నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లికి వెల్లడించింది.
ముగ్గురు నిందితులపై బాలిక తల్లి దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు యువకులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధు తెలిపారు. బాలికలు, మహిళలకు మాయమాటలు చెప్పి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Minor girl
- Siddipet
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

