తిరుపతి : తిరుచానూరు(Tiruchanur) పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 10న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koil Alwar Thiru Manjanam) నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందన్నారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేసినట్లు వెల్లడించారు.
పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయని అన్నారు. సెప్టెంబరు 15న సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొన్నారు. సెప్టెంబరు 16న పవిత్ర ప్రతిష్ఠ, 17న పవిత్ర సమర్పణ, 18న మహాపూర్ణాహుతి నిర్వహణ ఉంటుందని తెలిపారు.