WPL 2026 : మహిళా క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) నాలుగో సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సాయంత్రం 6:45 గంటలకు ఆరంభ వేడుక జరుగనుంది. బాలీవుడ్ సింగర్ యోయో హనీ సింగ్ (YoYo Honey Singh) పాటల హోరుకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుల డ్యాన్స్ మెరుపులతో నాలుగో సీజన్ అట్టహాసంగా మొదలవ్వనుంది. తొలి పోరులో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు తొలి బంతి పడనుంది.
ఐపీఎల్ తరహాలో మహిళా క్రికెట్ రూపురేఖల్ని మారుస్తూ డబ్ల్యపీఎల్కు బీసీసీఐ అంకురార్పణ చేసింది. 2023లో ఐదు ఫ్రాంచైజీలతో సంబురంగా, అట్టహాసంగా నిర్వహించిన మొదటి సీజన్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఛాంపియన్‌గా అవతరించింది. ఇక రెండో సీజన్లోనూ మేగ్ లానింగ్(Meg Lanning) కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఫైనల్ చేరినా కప్ కొట్టలేకపోయింది. ఫ్రాంచైజీ క్రికెట్లో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కలను సాకారం చేసింది స్మృతి మంధాన (Smriti Mandhana). మూడో సీజన్లోనూ ఢిల్లీ ఆఖరి మెట్టుపై తడబడగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఖాతాలో రెండో టైటిల్ చేరింది.
Power-packed performances. Electric vibes ⚡
Pre-match entertainment at its best as Jacqueline Fernandez, Honey Singh & Harnaaz Sandhu are all set to light up the #TATAWPL 🔥
Watch it LIVE tonight at 6:45 PM on @JioHotstar and @StarSportsIndia #MIvRCB | #KhelEmotionKa pic.twitter.com/AQT4gcbsfU
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
అయితే.. మూడుసార్లు ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీకి రాత మార్చేందుకు జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) సిద్ధంగా ఉంది. వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకం బాదిన జెమీమా కెప్టెన్‌గా ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఇక ఇప్పటివరకూ ఫైనల్ చేరని గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు టైటిల్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. గత మూడు సీజన్లలో ఢిల్లీని నడిపించిన లానింగ్ ఈసారి యూపీ వారియర్స్ (UP Warriorz)సారథిగా వ్యవహరించనుంది. ఇక యూపీ వారియర్స్‌కు తొలి టైటిల్ కట్టబెట్టేందుకు స్టార్ ఆల్‌రౌండర్ అషే గార్డ్నర్ పట్టుదలతో ఉంది. దాంతో.. ఈ సీజన్లోనైనా కొత్త ఛాంపియన్‌ను చూస్తామా? అని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
2023 సీజన్ విజేత – ముంబై ఇండియన్స్, రన్నరప్ – ఢిల్లీ క్యాపిటల్స్, అత్యధిక పరుగులు – మేగ్ లానింగ్(ఢిల్లీ క్యాపిటల్స్) – 345. అత్యధిక వికెట్లు – హీలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్) – 16. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ – హీలీ మాథ్యూ్స్(ముంబై ఇండియన్స్).
2024 సీజన్ విజేత – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రన్నరప్ – ఢిల్లీ క్యాపిటల్స్. అత్యధిక పరుగులు ఎలీసా పెర్రీ(ఆర్సీబీ) – 347, అత్యధిక వికెట్లు శ్రేయాంక పాటిల్(ఆర్సీబీ) 13, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ – దీప్తి శర్మ(యూపీ వారియర్స్), 295 రన్స్, 10 వికెట్లు.
2025 సీజన్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్, అత్యధిక పరుగులు – నాట్‌సీవర్ బ్రంట్(ముంబై) – 523, అత్యధిక వికెట్లు – అమేలియా కేర్, హీలీ మాథ్యూస్ (ముంబై) – 18, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ – నాట్ సీవర్ బ్రంట్(523 పరుగులు,12 వికెట్లు)
Navi Mumbai is #TATAWPL ready 🙌
Which fixture from the first leg of the season are you most excited for? 🤔
Follow TATA WPL 2026 from TOMORROW on https://t.co/rG3cQadgHN 💻 #KhelEmotionKa pic.twitter.com/iSDf28G4A5
— Women’s Premier League (WPL) (@wplt20) January 8, 2026