Road Accident | హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది (bus plunges into gorge). ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం సిర్మౌర్ (Sirmaur) జిల్లాలోని రేణుకాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. అయితే బస్సు హరిపుర్ధార్ మార్కెట్ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి 60 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Watch: బస్సును ఓవర్ టేక్ చేసేందుకు బైకర్ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Shoots Wife, Children, Kills Self | భార్య, పిల్లలను కాల్చి చంపి.. వ్యక్తి ఆత్మహత్య
Gold Looted: జ్వలరీ షాపు ఓనర్పై అటాక్.. 60 లక్షల ఖరీదైన బంగారం లూటీ