Unstoppable Team India : ప్రపంచ క్రికెట్లో ఒక్కో జట్టు కొంతకాలం పాటు ఆధిపత్యం చెలాయించడం చూశాం. 1970 – 80వ దశకంలో వెస్టిండీస్ (West Inides) అజేయశక్తిగా అవతరించగా.. ఆపై ఆస్ట్రేలియా (Australia) వంతు. స్టీవ్ వా కెప్టెన్సీ నుంచి రికీ పాంటింగ్ సారత్యంలో వరల్డ్ కప్ టోర్నీల్లో హ్యాట్రిక్ విజయాలతో చరిత్ర సృష్టించింది ఆసీస్. ఆ తర్వాత ఇంగ్లండ్, న్యూజిలాండ్ పుంజుకోగా.. గత రెండేళ్లుగా భారత జట్టు (Team India) శకం నడుస్తోంది. ‘టోర్నీ, ఫార్మాట్ ఏదైనా కప్ మాదే’ అన్నట్టుగా చెలరేగుతున్న టీమిండియా.. అంతర్జాతీయంగా అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లుతోంది.
రెండేళ్లలో మూడు ట్రోఫీలు గెలవడం అంటే మామూలు విషయం కాదు. అందుకు నిలకడగా రాణించడం ఒక్కటే సరిపోదు ఒత్తిడిని చిత్తుచేయగల సత్తువ కూడా ఉండాలి. ఇప్పుడు టీమిండియాకు ఈ రెండూ ఉన్నాయి. అందుకే అజేయంగా ట్రోఫీలను ఎగరేసుకుపోతోంది. 2023లో సొంతగడ్డపై ఓటమన్నదే ఎరుగకుండా వన్డే వరల్డ్ కప్ (ODI WorldCup) ఫైనల్ చేరిన రోహిత్ శర్మ బృందం.. అనూహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో కంగుతిన్నది. ఆ ఓటమి నుంచి త్వరగానే తేరుకున్న టీమిండియా నిరుడు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ 20 వరల్డ్ కప్‌లో పంజా విసిరింది.
🏆🇮🇳 Hat-Trick of Glory!
India conquers the T20 World Cup 2024, ICC Champions Trophy 2025, and now the Asia Cup 2025! Legends in the making! 🔥🏏
📸: BCCI #TeamIndia #T20WorldCup2024 #AsiaCup2025 #Champions pic.twitter.com/lVel7H53eZ
— SportsTiger (@The_SportsTiger) September 28, 2025
లీగ్ దశ నుంచి సూపర్ -8, సెమీ ఫైనల్లో అదిరే విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో కోహ్లీ అర్ధ శతకంతో మెరవగా, బుమ్రా బెంబేలెత్తించాడు. పాండ్యా ఓవర్లో డేవిడ్ మిల్లర్ (David Miller) కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ స్టన్నింగ్ క్యాచ్ అందుకోగా 7 పరుగుల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన రెండోసారి పొట్టి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అంతేనా.. ఆ తర్వాత హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగిన భారత్ ప్రత్యర్థులకు దడ పుట్టించింది.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్‌పై విజయభేరితో ఫైనల్ చేరింది. టైటిల్ పోరులోనూ జూలు విదిల్చిన భారత క్రికెటర్లు కివీస్‌కు చెక్ పెట్టారు. మార్చి 25న జరిగిన ఫైనల్లో బ్లాక్‌క్యాప్స్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే ఊదిపడేసింది టీమిండియా. దాంతో.. 17 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఇక ఆసియా కప్‌లో సీనియర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) లేకున్నా సరే.. యువరక్తంతో నిండిన టీమిండియా నూ వరుస విజయాలతో ఫైనల్ చేరింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో లీగ్ దశ, సూపర్-4లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఫైనల్లోనూ దాయాదిని మట్టికరిపించింది. దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఛేదనలో తిలక్ వర్మ(69 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడగా.. తొమ్మిదోసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా అవతరిచింది. మరో ఐదు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభ కానున్నందున.. టీమిండియా జైత్రయాత్ర ఇలానే కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
𝗥𝗮𝘄 𝗘𝗺𝗼𝘁𝗶𝗼𝗻𝘀
Special Team 👌
Special Triumph 🙌🎥 From Dressing Room to the Field of Play – Scenes right through the final moments before #TeamIndia completed a stunning win in #AsiaCup2025 #Final! 👍 👍 pic.twitter.com/P2hfjarLQl
— BCCI (@BCCI) September 29, 2025