T20 World Cup Qualifiers : పొట్టి క్రికెట్లో సంచలనం నమోదైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టు ఏకంగా పదికి పదిమందిని రిటైర్డ్ ఔట్‌గా ప్రకటించింది. మహిళల టీ20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్స్ (T20 World Cup Qualifiers)లో యూఏఈ జట్టు 10 మందిని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ పంపి చరిత్ర సృష్టించింది.
శనివారం ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ కెప్టెన్ ఇషా రోహిత్ ఒజా(Esha Rohit Oza) సెంచరీతో కదం తొక్కింది. అనంతరం ఖతార్‌ను కుప్పకూల్చి 163 పరుగుల తేడాతో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఏఈ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. కెప్టెన్ రోమిత్ ఒజా శతకంతో చెలరేగగా భారీ స్కోర్ చేసింది. తొలి వికెట్‌కు ఓపెనర్ తీర్థ సతీష్‌తో కలిసి సారథి 192 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.
🚨 Rare Scenes in T20Is!! 🚨
Each batter from the UAE Women’s team came to the crease, and then all 10 batters deliberately retired out due to a rain threat. #CricketTwitter pic.twitter.com/RNqrvTxTQI
— Female Cricket (@imfemalecricket) May 10, 2025
16 ఓవర్ తర్వాత వర్ష సూచన ఉందని తెలియడంతో యూఏఈ అందర్నీ ఆడించాలనే ఉద్దేశంతో రిటైర్డ్ ఔట్ పద్ధతిని పాటించింది. టీ20ల్లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం సాధ్యం కాదు కాబట్టి.. ఒక్కొక్కరుగా క్రీజులోకి వచ్చి రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరారు. చూస్తున్న వాళ్లంతా అసలు ఏం జరుగుతుంది? అని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారనుకో.